OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. భయపెట్టే సీన్స్.. IMDBలో 9.2 రేటింగ్

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రివేంజ్ క్రైమ్ డ్రామాకు హారర్ ఎలిమెంట్స్ జోడించి రూపొందించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కొన్ని హారర్ సీన్స్ అయితే ఆడియెన్స్ ను బాగానే భయపెట్టాయి. ఐఎమ్ డీబీలో ఈ మూవీకి ఏకంగా 9.2 రేటింగ్ ఉండడం గమనార్హం.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. భయపెట్టే సీన్స్.. IMDBలో 9.2 రేటింగ్
OTT Movie

Updated on: Jun 06, 2026 | 12:52 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే లవ్, కామెడీ, యాక్షన్, హారర్, క్రైమ్.. ఇలా రకరకాల జానర్లకు చెందిన సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇలా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని కొన్ని హారర్ సీన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీకి 9.2 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కర్ణాటకలోని కొడగు జిల్లా చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. జీవితంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న హీరో చాలా కాలం తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. అతను ఊరికి వచ్చిన సమయంలోనే అక్కడ ఓ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఉత్సవం సందర్భంగానే అతనికి కొన్ని చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అలాగే కొన్ని పాత గొడవలు తెరమీదకు వస్తాయి. మరి హీరోకు ఉన్న పాత పగలు ఏంటి? తనపై పడిన నిందను ఎలా తొలగించుకున్నాడు ? తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు ? అన్నదే ఈ సినిమా కథ.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ అవుతోన్న ఈ సినిమా పేరు పీటర్. ఇదొక కన్నడ రివేంజ్ డ్రామా. సుకేష్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి, రామ్ నాద గౌడ్, వరుణ్ పటేల్, ప్రతిమా నాయక్, రఘు పాండేశ్వర్, రాధాకృష్ణ కుంబ్లే, దీనా పూజారి, సిద్దు, భరత్, మను కాసర్‌గోడ్, రక్షిత్ దొడ్డెర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు వారికి బాగా ఇష్టమైన కూర్గ్ ప్రాంతంలో దాగున్న రహస్యాలను, నేరాలను ఇందులో చక్కగా చూపించారు. పీటర్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ప్రస్తుతం ఈ మూవీ కేవలం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ లో మంచి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి పీటర్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో పీటర్..

 

పీటర్ సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us