OTT Movie: చేతబడులు, తంత్ర విద్యలు.. ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి

గత వారమే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మూఢ నమ్మకాలు, చేతబడులు, తంత్ర విద్యల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. అందుకే ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో రన్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: చేతబడులు, తంత్ర విద్యలు.. ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTT Movie

Updated on: Nov 02, 2026 | 8:00 PM

హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు రీచ్ ఎక్కువ. ముఖ్యంగా ఓటీటీలోఈ జానర్ సినిమాలను భాషతో సంబంధం లేకుండా తెగ చూసేస్తుంటారు ఆడియెన్స్. అలా గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మూఢ నమ్మకాలు, చేతబడులు, తంత్ర విద్యల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మూడ నమ్మకాలు, తంత్ర విద్యలు, చేతబడుల పేరుతో అమాయక ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఆ భ్రమల్లో పడి ప్రాణాలు ఎలా కోల్పోతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. సుమారు 2 గంటల రన్ టైమ్ తో సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియెన్స్ ను తీవ్ర భయానికి గురి చేస్తాయి. ఈ సినిమా కథంతా గర్భిణి అయిన ఆస్థ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త రాజ్‌వీర్‌తో కలిసి ఉత్తరాఖండ్ అడవుల గుండా ఢిల్లీకి ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఓ ప్రమాదానికి గురవుతుంది. స్పృహ తప్పి కన్ను తెరిచేసరికి ఆమె ఓ గుర్తు తెలియని ఇంట్లో ఉటుంది. అక్కడ మోహన్ ఠాకూర్ , కామిని ఠాకూర్ దంపతులు ఆమెను ఆప్యాయంగా చూసుకుంటారు. అయితే ఆ ప్రేమ, ఆప్యాయతల వెనక ఓ భయంకరమైన కుట్ర దాగి ఉంటుంది. ముఖ్యంగా మోహన్ ఠాకూర్ చేతబడులు, క్షుద్రపూజలు చేయడంలో నిష్ణాతురాలు. మరి గర్భంతో ఉన్న ఆస్థను ఎందుకు అక్కడికి తీసుకొచ్చారు. వారి ఉద్దేశమేంటి? ఈ భయానక వాతావరణంలో చిక్కుకున్న ఆస్థ ఆ ఇల్లు దాటి బయటపడిందా? తన బిడ్డను కాపాడుకోగలిగిందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఝాద్-ఫూంక్’ (Jhaad-Phoonk). ఇదొక బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ. ‘ఝాద్-ఫూంక్’ అంటే తెలుగులో చేతబడి, తంత్ర విద్యలు అని అర్థం. రాజన్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సుంబుల్ తౌకీర్ ఖాన్, హర్ష్ రాజ్‌పుత్, పద్మిని కొల్హాపురే, యశ్‌పాల్ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకునేవారికి ‘ఝాద్-ఫూంక్’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

‘ఝాద్-ఫూంక్’ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us