OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చేసిన 18 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు.. లిస్టు ఇదిగో..

మహాశివరాత్రికి అటు థియేటర్లు.. ఇటు ఓటీటీల్లో పలు సినిమాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఈ వీకెండ్‌కు ధనుష్ 'సార్'..

OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చేసిన 18 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు.. లిస్టు ఇదిగో..
Ott Movies

Updated on: Feb 17, 2023 | 8:23 PM

మహాశివరాత్రికి అటు థియేటర్లు.. ఇటు ఓటీటీల్లో పలు సినిమాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఈ వీకెండ్‌కు ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, సంతోష్ శోభన్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండగా.. ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ లిస్టు ఏంటో చూసేద్దాం పదండి..

  • గాలోడు:

సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి అటు ‘ఆహా’, ఇటు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • కళ్యాణం కమనీయం:

సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • లక్కీ లక్ష్మణ్:

స‌య్యద్ సోహైల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లక్కీ లక్ష్మణ్ ‘ఆహా’ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • సదా నన్ను నడిపే :

ఇప్పటికే ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం కూడా వహించాడు.

  • సర్కస్ :

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 

  • నెట్‌ఫ్లిక్స్:

ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్

కమ్యూనిటి స్క్వాడ్

గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2

అన్ లాక్డ్

ది అప్ షాస్ సీజన్ 3

  • జీ5:

లాస్ట్(Lost)

  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ది నైట్ మేనేజర్

జే-హోప్ ఇన్ ది బాక్స్

  • బుక్ మై షో(మూవీస్):

లవ్ ఆన్ ది రాక్

  • షీమారో:

మృగతృష్ణ

  • హోయ్ చోయ్:

బుకేర్ మధ్య అగుణ్

దిల్ ఖుష్

  • సింప్లీ సౌత్ ఫర్ ఓవర్సీస్:

కాంతార: తులు వెర్షన్ (TULU)