OTT Movie: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. తెలుగుతో సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

దుల్కర్ సల్మాన్ నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదలై దాదాపు 45 రోజులకు పైగానే అయ్యింది. అక్టోబర్ 16న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అది రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. తెలుగుతో సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
OTT Movie

Updated on: Oct 21, 2026 | 4:31 PM

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఐయామ్ గేమ్. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. గతంలో ఆర్డీఎక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 03న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దుల్మర్ సల్మాన్ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. అయితే దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. అలాగే హాలీవుడ్ స్టైల్ లో సాగే ఈ సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉందని ప్రశంసలు వచ్చాయి. కాగా ఐ యామ్ గేమ్ సినిమా రిలీజై దాదాపు 45 రోజులు గడిచిపోయాయి. అయితే ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. కనీసం స్ట్రీమింగ్ డేట్ పై ఎలాంటి అప్టేట్స్ కూడా రాలేదు. ఆ మధ్యన అక్టోబర్ 16 నుంచి జియో హాట్ స్టార్ లో దుల్కర్ సల్మాన్ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది రూమర్ గానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుందని, నవంబర్‌ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కాగా ‘ఐయామ్ గేమ్’ విషయంలో 56 రోజుల థియేట్రికల్ విండో కారణంగానే ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. జీ5 ఈ సినిమా హక్కులను సుమారు 12 కోట్లకు కొనుగోలు చేసిందని, నవంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఐ యామ్ గేమ్ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కథిర్, వినయ్ ఫోర్ట్ , సంయుక్త విశ్వనాథన్ తదితరులు నటించారు. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం.

దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us