
సాధారణంగానే దుల్కర్ సల్మాన్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రేక్షకులు ఊహించని విధంగా కాన్సెప్టులు, స్టోరీలతో సినిమాలు తీస్తాడీ స్టార్ హీరో. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా సేమ్ ఇలాంటి సినిమా గురించే. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. సినిమా మొత్తం హాలీవుడ్ స్టైల్ లో సాగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ట్విస్ట్ లు కూడా అసలు ఊహించలేరు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
దుల్కర్ సల్మాన్ నటించిన ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐయామ్ గేమ్. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. గతంలో ఆర్డీఎక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 03న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, హాలీవుడ్ స్టైల్ లో సాగే సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులనుబాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందన్న ప్రశంసలు వచ్చాయి. ఐ యామ్ గేమ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం(నవంబర్ 06) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.
ఐ యామ్ గేమ్ చిత్రంలో దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్ తో పాటు ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కథిర్, వినయ్ ఫోర్ట్ , సంయుక్త విశ్వనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
ఐయామ్ గేమ్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.