
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా ‘మనశంకర వరప్రసాద్‌గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ రూ.400 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. తద్వారా రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చి త్రంగా ‘మనశంకర వరప్రసాద్‌గారు’ మూవీ రికార్డుల కెక్కింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేసిన ఈ మెగా మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీలో ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సందడి మొదలు కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మెగాస్టార్ మనశంకర వరప్రసాద్‌గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించి ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
It’s big, bigger and the biggest blockbuster!
Stay Tuned#ManaShankarVaraPrasadGaru #ManaShankarVaraPrasadGaruOnZee5 #Chiranjeevi #Teluguzee5 #AnilRavipudi pic.twitter.com/eTNHPZFwBY
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 4, 2026
‘మనశంకర వరప్రసాద్‌గారు’ తో పాటు సంక్రాంతికి రిలీజైన పరాశక్తి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు జీ5 ప్రకటించింది.
Telugu film #ManaShankarVaraPrasadGaru (2026) by @AnilRavipudi, premieres Feb 11th on @ZEE5India.@KChiruTweets @Venkymama#Nayanthara @CatherineTresa1 @TheSudevNair #ZarinaWahab @SachinSKhedekar @SaxenaSharat@Shine_Screens @GoldBoxEntpic.twitter.com/UyH8LPLnUX
— CinemaRare (@CinemaRareIN) February 4, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..