పాకిస్తాన్ కంటెంట్ బ్యాన్ చేయండి.. ఓటీటీ, సోషల్ మీడియాలకు కేంద్రం ఆదేశం

జిత్తులమారి పాక్‌... భారత సైన్యంతో యుద్ధం చేయలేక సరిహద్దులో సామాన్య పౌరులపై ప్రతాపం చూపిస్తోంది. విచ్చలవిడిగా, విచక్షణారహితంగా కాల్పులకి తెగబడుతోంది. పాక్ కవ్వింపు చర్యలకి భారత సైనికులు ధీటుగానే బదులిస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ కు సంబంధించిన అన్ని విషయాల పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

పాకిస్తాన్ కంటెంట్ బ్యాన్ చేయండి.. ఓటీటీ, సోషల్ మీడియాలకు కేంద్రం ఆదేశం
Ott

Updated on: May 08, 2025 | 7:10 PM

ఆపరేషన్ సింధూర్ తర్వాత కడుపుమంటతో రగిలిపోతున్న పాక్.. భారత్‌లో దాడులకు ప్లాన్ చేసింది. మొత్తం 13 ప్రాంతాలను టార్గెట్‌ చేసింది. డ్రోన్ క్షిపణులను ప్రయోగించింది. మే 7 రాత్రి ఉత్తర, పశ్చిమ భారత్‌లోని అవంతిపుర, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, లుథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నల్‌, ఫలోడి, ఉత్తరలై‌లో దాడులు చేసేందుకు యత్నించింది. అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్ మిసైళ్లను ఎస్‌-400తో గాల్లోనే పేల్చేశాయి. భారత భూభాగంపై పడకుండా చాకచాక్యంగా వాటిని నిర్వీర్యం చేసింది. ఇదే సమయంలో తమ సైనిక స్థావరాలపై దాడి చేస్తే.. ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది భారత్.

ఇదిలా ఉంటే పాక్ కు సంబంధించిన అన్ని విషయాల పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దుల్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత్, ఇప్పుడు వారి విషపూరిత ప్రచారానికి కూడా గట్టిగా తాళం వేస్తోంది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలోని ప్రతి ఓటీటీ వేదిక, ప్రతి మీడియా స్ట్రీమింగ్ సర్వీస్, ప్రతి డిజిటల్ మధ్యవర్తి ఇకపై పాకిస్తాన్ మూలాలు కలిగిన ఏ ఒక్క వెబ్ సిరీస్‌ను, సినిమాను, పాటను, పాడ్‌కాస్ట్‌ను మరే ఇతర మీడియా కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని కఠినంగా ఆదేశించింది. దాంతో ఓటీటీల్లో ఉన్న పాక్ కంటెంట్ డిలీట్ చేయనున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఉన్న పాక్ సాంగ్స్, యూట్యూబ్ కంటెంట్ ను కూడా తొలగించాలని కేంద్రం ఆదేశించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.