Ban Netflix: కొంపముంచిన మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..

|

Aug 07, 2021 | 9:56 AM

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‏గా మారింది. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది

Ban Netflix: కొంపముంచిన మణిరత్నం నవరస వెబ్ సిరీస్.. నెట్‏ఫ్లిక్స్ బ్యాన్ చేయాలంటూ నెట్టింట్లో రచ్చ..
Follow us on

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‏గా మారింది. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది విలక్షణ నటులు నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‏ఫామ్‏ నెట్‏ఫ్లిక్స్‏లో విడుదలైంది. కోపం, శోకం, హాస్యం ఇలా నవరసాలకు సంబంధించిన కథలను ఇందులో చూపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చెలరేగాయి. మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‏ను అవమానించినట్లుగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వెబ్ సిరీస్‏ను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్‏ఫ్లిక్స్‏ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్‏లో #Ban Netflix అంటూ డిమాంట్ చేస్తున్నారు.

Navasara

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ నవరస.. దక్షిణాదిలోనే అతి పెద్ద వెబ్ సిరీస్. ఇందులో తొమ్మిది విభిన్న కథలను ప్రత్యేకంగా రూపొందించాడు. ఈ సిరీస్‏లో 7వ ఎపిసోడ్ ఇన్మై స్టోరీ పోస్టర్ ద్వారా అసలు వివాదం మొదలైంది. ఈ పోస్టర్‏లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‏ను అవమానించినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ సిరీస్ లేదా.. నెట్‏ఫ్లిక్స్‏ను బహిష్కరించాలని.. మతపరమైన మనోభావాలని దెబ్బతీశారని ఆరోపిస్తూ సినిమాలో నటించిన నటీనటులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ పోస్టర్‍ను తమిళ వార్త పత్రిక ముద్రించింది. దీంతో అతడిని కూడా శిక్షించాలని నెట్టింట్లో ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అటు డైరెక్టర్ మణిరత్నం, ఇటు నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించలేదు. రాజా అకాడమీ అనే భారతీయ సున్నీ సంస్థ నెట్‏ఫ్లిక్స్ సిరీస్ ఈ సిరీస్‏ను స్ట్రీమింగ్ చేసినందుకు బ్యాన్ చేయాలని ఫిర్యాదు చేసింది.

ట్వీట్స్..

Also Read: Yo Yo Honey Singh: గృహహింస కేసుపై స్పందించిన యోయో హనీ సింగ్.. భార్యపై సంచలన కామెంట్స్..

Bigg Boss: బిగ్‏బాస్‏లోకి మరో అందాల తార.. తెరపైకి జాంబిరెడ్డి బ్యూటీ..