ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారమవుతుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించారు. విప్లవ్ కోనేటి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అనూహ్యమైన రీతిలో సాగుతుంది కథ. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటుంది. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్టడమేనా? ఈ కథను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్యమైన ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్… ఇలాంటివి ఎన్నెన్నో కళ్లముందు కదలాడుతుంటాయి. కథ విషయానికి వస్తే, మదనపల్లి టౌన్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తెరకెక్కింది. ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ.
హెబ్బా పటేల్ ఇటీవల నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ . ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆహాలో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ తో మళ్లీ ఆహా ప్రేక్షకులను పలకరించనున్నారు హెబ్బా పటేల్. రీసెంట్‌గా మళ్లీ పెళ్లితో ఆహా ఆడియన్స్ ని అలరించిన నరేష్ వీకే, పవిత్రా లోకేష్ కూడా ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్ లో భార్య భర్తలుగా నటించారు. ఆద్యంతం సస్పెన్స్ తో ఇంతవరకూ కనీవినీ ఎరుగని థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది అక్టోబర్ 6 నుంచి ఆహాలో. థ్రిల్లర్ జోనర్‌కి సరికొత్త నిర్వచనం చెప్పే సినిమా కానుంది ది గ్రేట్ ఇండియన్ మర్డర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.