Allu Arjun: అల్లు అర్జున్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా గట్టిగా వినిపిస్తోంది. పుష్ప సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు స్టైలిష్ స్టార్. అద్భుత నటనతో సినిమాను ఒంటి చేత్తో విజయం అందించిన అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా స్టైలిష్ స్టార్ మరో కొత్త అవతారమెత్తనున్నారని తెలుస్తోంది. నటుడిగా ఎంతో మందిని ఆకట్టుకున్న నట సింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ ద్వారా టాక్ షోలో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే దారిలో నడవనున్నారని సమాచారం.
ఆహా వేదికగా ప్రసారమయ్యే ఓ షోలో స్టైలిష్ స్టార్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారనేది సదరు వార్త సారాంశం. ఇప్పటికే బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు అనూహ్య స్పందన రావడంతో ఆహా మేకర్స్ ఓ షో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఆహా అల్లు అర్జున్‌కుటుంబానికే చెందినది కావడంతో బన్నీ కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి బన్నీ కూడా ఇదే దారిలో నడుస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే బన్నీ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. డంపర్ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టులు.. అర్హత పదో తరగతే..?
ariyana glory: రెడ్ డ్రెస్ లో అదరగొడుతున్న అరియానా గ్లోరీ లేటెస్ట్ ఫోటోస్
Brahmos Supersonic: భారత్ అమ్ములపొదలో మరో వజ్రాయుధం.. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం..