Aha OTT: ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో.. WPP మోషన్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కీలక ఒప్పందం

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ షో రియాలిటీ షో రాబోతోంది. జబర్దస్త్ యాంకర్ రష్మి, వైవా హర్ష, లక్ష్మీ మంచు ఈ షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా ఈ రియాలిటీ షో కోసం ఆహా కీలక నిర్ణయం తీసుకుంది.

Aha OTT: ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో.. WPP మోషన్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కీలక ఒప్పందం
Aha OTT

Updated on: Jun 26, 2026 | 7:55 PM

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ రియాలిటీ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి గౌతమ్ ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. విశ్వభారత్, ఫేమస్ రామ్, సింధు కసారం, అనిరుధ్ నారాయణం, రవి కిరణ్ బేవర, అఖిల్ జాక్సన్, డయానా, రవి, గౌతమ్ కుమార్, అమృత భూపతిరాజు, గ్రాండ్‌పా కిచెన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.

8 ఎపిసోడ్స్ గా ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ప్రతి ఎపిసోడ్ లో ప్రత్యేక థీమ్ తో కూడిన ఛాలెంజ్ లను కంటెస్టెంట్స్ ఎదుర్కోవాల్సిఉంటుంది. సోషల్ మీడియాలోని వినోదాన్ని వీక్షకులకు అందిస్తూ సాగే ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో సరికొత్త విజువల్ ప్రెజెంటేషన్, మేకింగ్ తో ఆకట్టుకోనుంది. కంటెస్టెంట్స్ సోషల్ మీడియా ఛాలెంజ్‌లు, రీల్స్ తో సాగే టాస్క్‌లలో పాల్గొంటారు. దీంతో ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు కానున్నారు.

ఈ కార్యక్రమం గురించి WPP మీడియా సౌత్ ఏషియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ పద్మనాభన్ మాట్లాడుతూ – తెలుగు వారి అభిమాన ఓటీటీ ఆహాతో కలిసి ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో నిర్వహించడం సంతోషంగా ఉంది. కంటెంట్ క్రియేటర్స్ మన కల్చర్ ను ప్రతిబింబించే మాధ్యమాలుగా మారిపోయారు. తెలుగువారి కోసం మేము అందిస్తున్న సరికొత్త రియాలిటీ షో ఇది. సృజనాత్మకత, సాంకేతికత కలగలిసిన ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకాబోతున్నాం. అన్నారు.

అర్హా మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఓఓ రామ్‌శివ లింగా మాట్లాడుతూ – తెలుగు డిజిటల్ క్రియేటర్స్ ప్రతిభను చాటే కార్యక్రమం ఇది. దీన్ని మేమొక పోటీగా చూడటం లేదు. మన కంటెంట్ క్రియేటర్స్ ప్రతిభను ఆహా ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో వేదిక మీద సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈతరం ప్రేక్షకులు కంటెంట్ ను ఎలా చూస్తున్నారో, ఎలా షేర్ చేసుకుంటున్నారో తెలియజేసే షో ఇది. అన్నారు.

ఆహా టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ రియాలిటీ షో ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us