‘నిన్నిలా నిన్నిలా’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్.. సినిమా ఎప్పుడు వస్తోందంటే..

|

Feb 05, 2021 | 1:56 PM

Ninnila Ninnila Movie Trailer: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న

నిన్నిలా నిన్నిలా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్.. సినిమా ఎప్పుడు వస్తోందంటే..
Follow us on

Ninnila Ninnila Movie Trailer: శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘నిన్నిలా నిన్నిలా’ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయింది. ఇందులో అశోక్ సెల్వన్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మంచి కామెడీ, ఎమోష‌న్స్‌, ల‌వ్ క‌ల‌బోత‌తో రూపొందింది.

దీంతో ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్ విడుద‌ల కాగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేయగా యూట్యూబ్‌లో దూసుకువెళుతుంది. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఫిబ్రవ‌రి 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తన్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.