Nidhhi Agerwal: సూపర్ ఛాన్స్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ .. మహేష్ సినిమాలో నిధి..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: సూపర్ ఛాన్స్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ .. మహేష్ సినిమాలో నిధి..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 24, 2021 | 8:38 AM

Nidhhi Agerwal: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. అంతకు ముందు ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార . రెండో సినిమాతోనే అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని ఇటీవల వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తుంది.

త్వరలో ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహెష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీబిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్  శరవేగంగా జరుగుతున్నా సమయంలో కరోనా కారణంగా చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను పరిశీలిస్తున్నారట. అయితే ముందుగా మహేశ్ బాబు సినిమా కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నిధి పేరు తెరపైకి వచ్చింది. అయితే మహేష్ సినిమా నిధి మెయిన్ రోల్ లో కనిపిస్తుందా లేక సెకండ్ హీరోయిన్ గా కనువిందు చేస్తుందా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

Salman Khan: సౌత్ సినిమా సాంగ్స్ పైన మోజుపడుతున్న సల్మాన్ ఖాన్.. రాధే మూవీలో ఆ పాట..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో