Nayantara : ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. అతడితో సినిమా ఎప్పటికీ మర్చిపోలేను.. నయనతార..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరో గురించి ఇప్పుడు నయనతార చేసిన కామెంట్స్ సోషళ్ మీడియాలో వైరలవుతున్నాయి. అతడు రిహార్సల్స్ లేకుండానే అత్యద్భుతంగా డ్యాన్స్ చేస్తారని నయనతార చెప్పుకొచ్చారు. అలాగే సెట్స్ లో అతడి సరదా స్వభావాన్ని గుర్తుచేసుకుంటూ, తెరపై అతని అద్భుతమైన రూపాంతరాన్ని, సహజమైన డ్యాన్స్ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

Nayantara : ఆ హీరో లాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. అతడితో సినిమా ఎప్పటికీ మర్చిపోలేను.. నయనతార..
Nayanthara

Updated on: Sep 21, 2026 | 12:31 PM

టాలీవుడ్ హీరోయిన్ నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ నైపుణ్యంపై గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ఒక బ్రాట్ (సరదాగా) అని ఆమె చెబుతూనే, సెట్స్‌లో అతనితో గడిపిన కొన్ని ఆసక్తికర క్షణాలను పంచుకున్నారు. ఒక సందర్భంలో, నయనతార టచ్‌అప్ చేసుకుంటున్నప్పుడు, ఎన్టీఆర్ ఆమెను ఆటపట్టిస్తూ, “ఎవరూ నిన్ను చూడరు, అందరూ నన్నే చూస్తారు. నువ్వెందుకు టచ్‌అప్ చేసుకుంటున్నావు?” అని సరదాగా అన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ చాలా క్యూట్‌గా ఉంటారని నయనతార పేర్కొన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ చేసే విధానం, తెరపై అతని రూపాంతరం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని నయనతార తెలిపారు. షూటింగ్ సమయంలో అతను ఎప్పుడూ రిహార్సల్స్ చేయడం చూడలేదని ఆమె స్పష్టం చేశారు. చాలా మంది నటులు డ్యాన్స్ చేయడానికి ముందు రిహార్సల్స్ చేస్తారని, అది సాధారణమేనని ఆమె అన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రిహార్సల్స్ చేయని ఏకైక హీరో అని నయనతార అప్పట్లో గమనించినట్లు చెప్పారు. “ఇప్పుడు చేస్తాడో లేదో తెలియదు, కానీ ఆ సమయంలో చేయలేదు,” అని ఆమె పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ చేసే డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చాలా విచిత్రంగా, అసాధారణంగా ఉంటాయని, వాటిని తారక్ మాత్రమే చేయగలడని ఆమె అభిప్రాయపడ్డారు. అతను వచ్చి “హా, ఏం చేస్తున్నాం?” అని అడుగుతారని, టేక్‌కు సిద్ధంగా ఉంటారని నయనతార వివరించారు. రిహార్సల్స్ చేయమని అడిగితే, “మీకు రిహార్సల్ కావాలంటే మీరు చేసుకోండి. కానీ నేను రెడీ” అని ఎన్టీఆర్ సమాధానం చెప్పేవారని నయనతార గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నిజానికి ఒక డ్యాన్సర్ చేసిన దానికంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడని నయనతార ప్రశంసించారు. అతని నైపుణ్యం చాలా గొప్పదని అన్నారు. తారక్‌తో పని చేయడం ఒక గొప్ప అనుభవమని, అతను అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి అని నయనతార తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అయితే, ఇంతటి సహజ సిద్ధమైన డ్యాన్స్ నైపుణ్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా ప్రముఖ దర్శకుడు రాజమౌళి “నాటు నాటు” పాట కోసం చాలాసార్లు చేయించారని యాంకర్ సరదాగా గుర్తుచేశారు. ఈ సంభాషణ జూనియర్ ఎన్టీఆర్ సహజమైన డ్యాన్స్ టాలెంట్‌ను, అతని వృత్తిపరమైన విధానాన్ని స్పష్టం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎన్టీఆర్..

Jrntr

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us