‘కలర్ ఫొటో’ దర్శకుడికి నాని క్రేజీ ఆఫర్‌

ఈ మధ్య ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో కలర్ ఫొటో ఒకటి. సందీప్ రాజ్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీలో సుహాస్, చాందినీ చౌదరి, సునీల్‌, వైవా హర్ష తదితరులు

కలర్ ఫొటో దర్శకుడికి నాని క్రేజీ ఆఫర్‌

Edited By:

Updated on: Nov 03, 2020 | 4:53 PM

Nani Colour Photo director: ఈ మధ్య ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో కలర్ ఫొటో ఒకటి. సందీప్ రాజ్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీలో సుహాస్, చాందినీ చౌదరి, సునీల్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన రోజే ఈ మూవీకి పాజిటివ్‌ టాక్ రాగా.. అల్లు అర్జున్‌, నాని, జగపతి బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ తదితరులు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయంటూ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. (సినిమాలకు కాజల్‌ గుడ్‌బై.. చందమామ ట్వీట్‌ అంతర్యమేంటి..!)

కాగా ఈ మూవీ దర్శకుడు సందీప్‌కి ఇప్పుడు నాని క్రేజీ ఆఫర్ ఇచ్చారు. కలర్‌ ఫొటో గురించి మాట్లాడిన నాని.. సందీప్‌ని నా బ్యానర్‌లోనే ఇంట్రడ్యూస్‌ అవ్వాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. కానీ ఇప్పుడు నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని సందీప్‌ చాలా పెంచాడు. నా వాల్‌ పోస్టర్‌ సినిమాలో సందీప్‌తో ఓ సినిమాను నిర్మిస్తా అని నాని చెప్పుకొచ్చారు. ఇక సుహాస్ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సుహాస్‌తో కచ్చితంగా కలిసి నటిస్తా. అతడు చాలా ఎక్స్‌పెన్సివ్‌ నటుడు అని తెలిపారు.