త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘నమస్తే సేట్ జీ’.. భిన్నమైన కథతో అభిమానుల ముందుకు వస్తున్న తల్లాడ..

లాక్‌డౌన్ సమయంలో కిరాణా షాపుల వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ సమయంలో వారు చేసిన సేవలు ఇప్పుడు చిత్రంగా రాబోతున్నాయి.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు నమస్తే సేట్ జీ.. భిన్నమైన కథతో అభిమానుల ముందుకు వస్తున్న తల్లాడ..

Updated on: Dec 09, 2020 | 5:53 AM

లాక్‌డౌన్ సమయంలో కిరాణా షాపుల వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ సమయంలో వారు చేసిన సేవలు ఇప్పుడు చిత్రంగా రాబోతున్నాయి. ఈ చిత్రం పేరు నమస్తే సేట్ జీ. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవల హీరో సునీల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అందిస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసిన కిరాణాషాప్‌ నిర్వాహకులకు సంబంధించిన కథ ఇదని అన్నారు. మా నాన్న కూడా ఒక కిరాణాషాపు నిర్వహించేవారని, ఒక కిరాణాషాపు వ్యాపారి కొడుకుగా నేను తీసిన ఈ చిత్రం కిరాణాషాపుల యజమానుల నిజ జీవితాలకు దగ్గరగా వుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ఈ చిత్రానికి కథ రమేష్‌కుమార్‌, సంగీతం పవన్‌, వీఆర్‌ ప్రదీప్‌, అందిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకువస్తామని తెలిపారు. మంచి సినిమాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అలాగే మా సినిమాను కూడా అందరు ఆదరించాలని కోరారు.

Follow Us