మరో సినిమాను ప్రకటించిన నాగశౌర్య

| Edited By:

Oct 17, 2020 | 10:01 AM

యువ హీరో నాగశౌర్య జోరును పెంచుతున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా మారనున్నారు. ఇప్పటికే సౌజన్య అనే కొత్త దర్శకురాలు దర్శకత్వంలో నటిస్తోన్న నాగశౌర్య, మరో మూవీని ప్రకటించారు

మరో సినిమాను ప్రకటించిన నాగశౌర్య
Follow us on

Naga Shaurya next announced: యువ హీరో నాగశౌర్య జోరును పెంచుతున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా మారనున్నారు. ఇప్పటికే సౌజన్య అనే కొత్త దర్శకురాలు దర్శకత్వంలో నటిస్తోన్న నాగశౌర్య, మరో మూవీని ప్రకటించారు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ యువ హీరో నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుండగా, ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా రాహుల్ రవీంద్రన్ నటించిన అలా ఎలా మూవీతో అనీష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీతో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ తరువాత రాజ్ తరుణ్‌తో లవర్‌ని తెరకెక్కించగా.. ఆ మూవీ అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు నాగశౌర్య మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

Read More:

ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా మహేష్‌ హీరోయిన్‌..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి