ముగిసిన నడిగర్‌ సంఘం ఎన్నికలు

|

Jun 23, 2019 | 6:28 PM

చెన్నై: ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు..తీవ్ర ఉత్కంఠ మధ్య మొదలైన నడిగర్‌ సంఘం ఎన్నికలు ముగిశాయి. సంఘంలో మొత్తం 3,100 మంది సభ్యులు ఉండగా.. 1,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో పోలింగ్‌ నిర్వహించారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు జులై 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కోర్టు తుది తీర్పు తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. 2019-2022 ఏడాదికి గానూ ఈ ఎన్నికలు జరిగాయి. నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ జట్టు, […]

ముగిసిన నడిగర్‌ సంఘం ఎన్నికలు
Follow us on

చెన్నై: ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు..తీవ్ర ఉత్కంఠ మధ్య మొదలైన నడిగర్‌ సంఘం ఎన్నికలు ముగిశాయి. సంఘంలో మొత్తం 3,100 మంది సభ్యులు ఉండగా.. 1,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో పోలింగ్‌ నిర్వహించారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు జులై 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కోర్టు తుది తీర్పు తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. 2019-2022 ఏడాదికి గానూ ఈ ఎన్నికలు జరిగాయి.

నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ జట్టు, భాగ్యరాజ్‌ స్వామి నేతృత్వంలోని శంకర్‌దాస్‌ జట్టు బరిలో నిలిచాయి. నడిగర్‌ సంఘం అధ్యక్ష పదవికి పాండవార్‌ జట్టు నుంచి నటుడు నాజర్‌, శంకర్‌దాస్‌ జట్టు నుంచి నటుడు భాగ్యరాజ్‌ బరిలో ఉన్నారు. జనరల్‌ సెక్రటరీ పదవికి విశాల్‌, నిర్మాత గణేశ్‌ పోటీపడుతున్నారు. కోశాధికారి పదవికి నటుడు కార్తీక్‌, నటుడు ప్రశాంత్‌ బరిలో ఉన్నారు.