ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇస్మార్ట్ సుందరి.. థియేటర్‌లో అమృతా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..

క్రిస్మస్‌కి రిలీజైన ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమా పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన నభానటేశ్

ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇస్మార్ట్ సుందరి.. థియేటర్‌లో అమృతా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..

Updated on: Dec 26, 2020 | 7:50 PM

క్రిస్మస్‌కి రిలీజైన ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమా పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన నభానటేశ్ క్యారెక్టర్ గురించి ఇప్పడు అందరు చర్చించుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన మాస్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఈ భామ ఇందులో చాలా క్లాస్‌గా కనిపిస్తోంది. అందులోని చాందిని పాత్రకు, ఈ సినిమాలోని అమృత పాత్రకు అసలు పొంతనే కుదరదు. లాక్‌డౌన్ తర్వాత మొదటి సినిమా కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అమ్మడు పైనే ఉంది. ఇక సినిమా విషయానికొస్తే..

‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ లో నభానటేష్ తన మార్కును చాటుకుంది. కథ అసలైన మలుపు తీసుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ మొత్తం తనదైన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో సాయిధరమ్ తేజ్ తో తన కెమిస్ట్రీ బాగా పండించింది.అమృత అనే రోల్ లో చలాకీ గా కనిపించి ఎంటర్ టైన్ చేసింది.అంతే కాకుండా ఈ మూవీలో నభా చాలా అందంగా కనిపించింది అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు నభా మంచి ప్లస్ అయిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ నితిన్ తో అంధాధూన్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. కాగా ఈ సినిమాతో నభా కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.