టైటిల్ : సూర్యకాంతం
తారాగణం : రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల, పెర్లెన్ భేసానియా, శివాజీ రాజా, సుహాసినీ తదితరులు
సంగీతం : మార్క్ కె రాబిన్
దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
నిర్మాణ బ్యానర్ : నిర్వాణ సినిమాస్
ఇంట్రడక్షన్: మెగా డాటర్ నిహారిక కొణిదెల టైటిల్ రోల్ లో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
అభి(రాహుల్ విజయ్)కి అనుకోని పరిస్థితులలో సూర్యకాంతం(నిహారిక కొణిదెల)తో పరిచయం ఏర్పడుతుంది. చిలిపితనం, అల్లరితనం కలిగిన సూర్యకాంతం అంటే అభికి చాలా ఇష్టం. ఇది ఇలా ఉంటే సూర్యకాంతంను పెళ్లి చేసుకోమని ఆమె తల్లి(సుహాసిని) పోరు పెడుతుంది. అయితే ఆమె మాటలు సూర్యకాంతం వినదు. ఇలా ఉండగా ఒక రోజు సూర్యకాంతం తల్లి హార్ట్ ఎటాక్ తో చనిపోతుంది. దానితో సూర్యకాంతం ఒంటరి అవుతుంది. అప్పుడు అభి ఆమెకు అండగా నిలుస్తాడు. ఇక ఒక రోజు సూర్యకాంతంకు తన ప్రేమ విషయం చెబుతాడు అభి. కానీ సూర్యకాంతం ఆ తర్వాత రోజు నుంచి కనబడదు. ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవరికి తెలియదు. దానితో అభి కొద్దిరోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయి పూజ(పెర్లెన్ భేసానియా)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు.
అయితే సడన్ గా వారిద్దరి నిశ్చితార్ధం టైంలో రీ-ఎంట్రీ ఇస్తుంది సూర్యకాంతం. ఇక అభి అయితే తాను పూజను పెళ్లి చేసుకుంటున్నట్లు సూర్యకాంతంకు చెప్పలేడు. అనుకోని విధంగా ఒక రోజు సూర్యకాంతం అభికి ఐ లవ్ యు చెబుతుంది. దానితో షాక్ అయిన అభి అసలు విషయం చెబుతాడు. అప్పుడు సూర్యకాంతం ఏమి చేసింది.? అసలు సూర్యకాంతం ఎందుకు అలా సడన్ గా అభిని వదిలి వెళ్ళిపోయింది.? అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు.? సూర్యకాంతం తన ప్రేమను గెలిపించుకుందా.? అనేవి సినిమా చూడాల్సిందే.
నటీనటులు :
నిహారిక తన గత చిత్రాల కంటే ఈ చిత్రంలో బాగా నటించిందని చెప్పాలి. ముఖ్యంగా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో ఆమె చక్కని హావభావాలు కనబరిచింది. ఇక రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శివాజీ రాజా, సుహాసిని, సత్య మరియు తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కని నటన కనబరిచారు.
విశ్లేషణ :
కథ మొత్తం నిహారిక చుట్టూనే తిరిగేలా రాసుకున్నాడు డైరెక్టర్ ప్రణీత్. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. హీరో హీరోయిన్లు మధ్య ప్రేమ సన్నివేశాలు, అప్పుడప్పుడు వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులకు రీలీఫ్ కలిగిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. అంతేకాదు ఎమోషన్స్ కూడా పెద్ద పండలేదు. కాబట్టి సినిమా బోరింగ్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం బాగా డీల్ చేశాడు దర్శకుడు ప్రణీత్.
సాంకేతిక విభాగాల పనితీరు:
సాంకేతిక విభాగాల పనితీరు గురించి చెప్పాలంటే… ఎడిటింగ్ మరింత షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. ఇక కెమెరా వర్క్ బాగుంది. మార్క్ రాబిన్ అందించిన సంగీతం యావరేజ్ అనే చెప్పాలి, అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం డీసెంట్. కాగా నిర్వాణ సినిమాస్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రధారులు నటన
కొన్ని కామెడీ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్