‘సన్ ఆఫ్ ఇండియా’ స్టార్ట్ చేసిన డైలాగ్ కింగ్.. రెగ్యూలర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్న మోహన్‌బాబు..

|

Nov 25, 2020 | 5:01 PM

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు మళ్లీ మేకప్ వేసుకున్నాడు.. రెగ్యూలర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంతకీ ఏ సినిమా షూటింగ్ అనుకుంటున్నారా! అదే అక్టోబర్‌లో ప్రారంభించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన డైలాగ్ కింగ్.. రెగ్యూలర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్న మోహన్‌బాబు..
Follow us on

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు మళ్లీ మేకప్ వేసుకున్నాడు.. రెగ్యూలర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంతకీ ఏ సినిమా షూటింగ్ అనుకుంటున్నారా! అదే అక్టోబర్‌లో ప్రారంభించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాను శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో మోహన్‌బాబు పాత్ర చాలా పవర్‌పుల్‌‌గా ఉంటుందని చిత్ర బృందం తెలుపుతున్నారు. సమాజంలో మార్పు కలిగించే విధంగా కథా, కథనం సాగుతుందని తెలిపారు. మోహన్‌బాబు కూడా ఇటీవల సమాజానికి దోహదపడే పడే సినిమాలే చేస్తున్నారు. ఆయనకు తగిన విధంగా చిత్రం ఉంటుందని చిత్రయూనిట్ వివరించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నారని తెలిపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోహన్‌బాబు ఆవేశంగా చూస్తూ కనిపిస్తారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే లాక్‌డౌన్‌తో ఇన్ని రోజులు ఆపేసిన సినిమా షూటింగ్‌‌లన్ని ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి. మొదటగా చిన్న చిత్రాలు తిరిగి ప్రారంభించగా ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్‌లు కూడా పట్టాలెక్కుతున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో చాలా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో సినీ అభిమానులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.