సురేఖ ఒప్పుకోదేమో అనుకున్నా.. ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డా.. ఎమోషనల్ అయిన మెగాస్టార్..

నటి సమంత వ్యాఖ్యతగా ఓటీటీలో ప్రసారమవుతున్న సామ్‏జామ్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఎమోషనల్ విషయాలను వెల్లడించారు.

సురేఖ ఒప్పుకోదేమో అనుకున్నా.. ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డా.. ఎమోషనల్ అయిన మెగాస్టార్..

Updated on: Dec 25, 2020 | 7:07 PM

నటి సమంత వ్యాఖ్యతగా ఓటీటీలో ప్రసారమవుతున్న సామ్‏జామ్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఎమోషనల్ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తనని తాను సక్సెస్‏గా అభివర్ణించుకుంటానని తెలిపారు. అంతేకాకుండా ఆటోబయోగ్రఫీ రాయాలని, దాని ద్వారా కొద్దిమందిలోనైనా ప్రేరణ తీసుకురావాలని తనకు ఆశ ఉందని తెలిపారు.

శంకరాభరణం సినిమా విడుదలైన కొన్నిరోజులకు నాకు సురేఖకు పెళ్ళి చేయాలని పెద్దలు అనుకున్నారు. కానీ శంకరాభరణం ప్రిమియర్ షో సమయంలో తను నన్ను చూసే ఉంటుందేమో.. నాతో పెళ్ళికి తను ఒప్పుకోదేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ తను నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించిందని మెగాస్టార్ తెలిపారు. వేట సినిమా రిలీజ్ అయ్యాకా బాగా ఏడ్చేశాను. ఖైదీ తర్వార వేట విడుదల కావడంతో ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. దాంతో ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డా. ఆ తర్వాత విజేత సినిమా చూసినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయ్ అని చిరంజీవి వివరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us