Vishnu on Mahesh Babu: నీ అందానికి నీ మంచితనమే కారణం అంటూ మహేష్ బాబు పై మంచువారబ్బాయి ప్రశంసల వర్షం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరస సక్సెస్ సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో అయినా సరే అందరితోనూ కలిసి పోతూ..

Vishnu on Mahesh Babu: నీ అందానికి నీ మంచితనమే కారణం అంటూ మహేష్ బాబు పై మంచువారబ్బాయి ప్రశంసల వర్షం

Updated on: Jan 16, 2021 | 5:14 PM

Vishnu on Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరస సక్సెస్ సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో అయినా సరే అందరితోనూ కలిసి పోతూ.. అందరినీ కలుపుకునే నేచర్ మహేష్ బాబుదని టాక్.. నలభై లో కూడా ఇరవైలా కనిపించేటంతటి అందం మహేష్ బాబు సొంతం. హ్యాండ్సమ్ లుక్ తో పాటు ఎల్లప్పుడూ నవ్వుతు ఉండే మహేష్ బాబుని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సహా నటీనటులు ఇష్టపడతారు. దక్షిణాది నటులే కాదు,, బాలీవుడ్ హీరోయిన్స్ కూడా మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే వెంటనే ఒకే చెప్పేస్తాం అని మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. తాజాగా ప్రిన్స్ మహేష్ పై మంచువారబ్బాయి ప్రశంసల వర్షం కురిపించాడు.

మంచు విష్ణు భార్య వెరోనిక పుట్టిన రోజు వేడుకల్లో మహేష్ బాబు నమ్రతాలు పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ లో తీసుకున్న ఫోటోలను విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఫొటోలో ఉన్న ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే దానికి ప్రధాన కారణమని తాను గట్టిగా నమ్ముతున్నాను అంటూ ఆ ఫోటోతో పాటు కామెంట్‌ను జత చేశాడు. ఈ పోస్టు మహేష్ బాబు స్పందిస్తూ.. ఇంతమంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలుఅంటూ ట్వీట్‌ చేశాడు. ఈ వేడుకల్లో మరో హీరో గోపీచంద్‌ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉండగా.. మంచు విష్ణు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న మోసగాళ్లు సినిమాతో బిజీగా ఉన్నాడు.

Also Read: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్ అబ్రహం చెయ్యి.. గూగుల్ మ్యాప్ అంటున్న ఫ్యాన్స్

Loading...
Unable to load recommendations.
Follow Us