Superstar Krishna Funeral Highlights: ఎనభై వసంతాల సాహసికి సెలవు. వయసును జయించిన అసాధ్యుడికి ఇక సెలవు. తెలుగు గుండెలకు తన నటనతో పరిమళాలు అద్దిన బుర్రిపాలెం బుల్లోడు..! తెలుగు చిత్ర సీమకు తన సాహసాలతో నూతనోత్సాహాన్ని అందించిన జేమ్స్‌బాండ్..! ఆనాటి తేనె మనసులు నుంచి.. సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, జేమ్స్‌బాండ్ 777, సింహాసనం, బంగారు కుటుంబం, ఈనాడు, వజ్రాయుధం, నంబర్‌వన్..ఇలా అర్ద శతాబ్దంపాటు వెండితెరను వెలిగించిన ఎవర్‌గ్రీన్ హీరో.. మన సూపర్‌స్టార్ కృష్ణ దివికేగారు.
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం ఫిలిమ్ నగర్‌లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖల నడుమ అంత్యక్రియలను నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఇదిలా ఉంటే అంతకు ముందు పద్మాలయ స్టూడియోస్ నుంచి కృష్ణ అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అభిమానులు దారిపొడవున పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఇక కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
నట శేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అశేష అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ పద్మాలయ స్టూడియోస్ నుంచి ఫిల్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. పోలీసుల అధికారిక వందనంలో కృష్ణను వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి పోలీసులు గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మహాప్రస్థానం లోపలికి కేవలం కొందరిని మాత్రమే అనుమతిచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అంతిమ యాత్ర దారిపొడవుతా అభిమానులు నివాళి అర్పించారు. న్యాయ విహార నుంచి మహా ప్రస్థానం వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మరికాసేపట్లో కృష్ణ అంత్యక్రియలు ప్రారంభంకానున్నాయి.
తమ అభిమాన హీర ఇక లేరన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ చిత్రపటం వద్ద రోధిస్తున్న దృశ్యాలు.
????????
— movie buff (@newMovieBuff007) November 16, 2022
తండ్రి మరణంతో తీవ్ర విషాధంలో మునిగిపోయిన సూపర్ స్టార్ కృష్ణను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. కృష్ణ పార్ధివ దేహాన్ని సందర్శించిన అనంతరం మహేష్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘తెలుగ సినిమాకి సాంకేతిక హంగులు దిద్దిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ట్యాంబ్ బండ్‌పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కృష్ణకు దాదా సాహెబ్ అవార్డు ఇచ్చే విషయమై తెలంగాణ భాజపా తరఫున కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం’ అని తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానానికి యాత్ర సాగుతోంది. పోలీస్ వాహనం, పోలీస్ బ్యాండ్‌తో యాత్ర కొనసాగుతోంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కుమార్ రావ్ తదితరులు నివాళులు అర్పించారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
సూపర్ స్టార్ కృష్ణకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
సూపర్‌స్టార్ కృష్ణ అంతిమయాత్ర మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోస్ నుంచి ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే మహాప్రస్థానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని కడసారి సూసేందుకు అభిమానులు పద్మాలయా స్టూడియోస్ కు భారీగా తరలివచ్చారు. మరికాసేపట్లో కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
కృష్ణ అభిమానులతో పద్మాలయా స్టూడియోస్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు భారీగా చేరుకున్నారు. మరికాసేపట్లో కృష్ణ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.
సూపర్‌స్టార్ కృష్ణ అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. పద్మాలయా స్టూడియోస్ నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
సూపర్‌స్టార్ కృష్ణ కి ఏపీ మంత్రి రోజా నివాళులర్పించారు. అనంతరం మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు.
సూపర్‌స్టార్ కృష్ణ పార్థీవదేహానికి గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
సూపర్‌స్టార్ కృష్ణకు నివాళులర్పించిన అనంతరం సీఎం వైఎస్ జగన్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్.. మహేష్ తోపాటు.. కుటుంబసభ్యులందరినీ పరామర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కృష్ణకు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.
కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు నమ్రతా.. ఆమెతో పాటు కొడుకు గౌతమ్‌కృష్ణ, కూతరు సితార కూడా వచ్చారు.. తాత పార్ధివదేహాన్ని చూసి కంటనీరు పెట్టుకున్నారు. అంతకముందు డైరెక్టర్ శేఖర్ కముల, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నివాళులు అర్పించారు..
కృష్ణకు దర్శకుడు త్రివిక్రమ్, నటుడు కృష్ణుడు నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోకు చేరుకుని నివాళులర్పించారు.
పద్మాలయా స్టూడియోకు మహేష్, నమ్రత, నరేష్ చేరుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణకు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. పద్మాలయా స్టూడియోకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
సూపర్ స్టార్ కృష్ణకు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు శివ బాలాజీ నివాళులర్పించారు.
విజయశాంతి ఎమోషనల్ ట్వీట్..
“ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా… నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా…” అని, మీరు విజయనిర్మల గారితో అంటే… “నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది” అని 1980లో ఆంటీ అన్న మాట… నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం. pic.twitter.com/1lSaVKM7Fj
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే జగన్.. అక్కడి నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకొని పార్ధివదేహానికి నివాళి అర్పిస్తారు. హీరో మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు సీఎం జగన్.
తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. పోలీసుల గౌరవవందనం తర్వాత అంత్యక్రియలు ముగుస్తాయి.
తెలుగు సినీపరిశ్రమ శోకసంద్రంలో మునిగి పోయింది. పెద్దదిక్కును కోల్పోయామన్న బాధ తీవ్ర ఆవేదనకు గురవుతోంది. ఆయన మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ నేడు బంద్ పాటిస్తోంది.
కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్ సోదరి మంజుల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు . నాన్నా మీరే నా జీవితానికి సూపర్ స్టార్. చిత్ర సీమకు మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ నాన్న.’ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నింగికేగిన ధృవతార కృష్ణ మరణం కృష్ణ కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు తదితరులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. నలుమూలల నుంచి తరలివస్తోన్న అశేష ప్రజానీకం తమ అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
కృష్ణ అంతిమ యాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి మహాప్రస్తానం వరకు సాగుతుంది.దారి పొడువునా పార్ధివదేహాన్ని చూసేందుకు ఫ్యాన్స్ వస్తారన్న అంచనాతో భద్రతా పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో పద్మాలయా స్టూడియోస్ దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిమానుల సందర్శన కోసం పార్థీవదేహాన్ని ఉంచనున్నారు.
ఏపీలో మార్నింగ్ షోలు రద్దు..
సూపర్ స్టార్ కృష్ణకు ఏపీ నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. ఏపీలో మార్నింగ్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
నేడు హైదరాబాద్‌కు రానున్న ఏపీ సీఎం జగన్ రానున్నారు. కృష్ణ భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. ఉదయం11:20 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌కు జగన్ చేరుకుంటారు.
అభిమానుల సందర్శనార్ధం కృష్ణ భౌతికకాయం పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. తమ అభిమాన నటుడిని కడసారి సందర్శించుకునేందు అభిమానులు బారులు తీరారు.