‘మహర్షి’ ప్రీ రిలీజ్ బిజినెస్ ధమాకా..!

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. […]

మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ ధమాకా..!

Updated on: May 07, 2019 | 1:05 PM

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. అసలు ఈ సినిమాకు ఇంత భారీ బడ్జెట్ అవసరమా.? అంటూ ట్రేడ్ వర్గాల్లో చర్చ కూడా జరిగింది.

మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అని తెలుస్తోంది. అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ కలిసి నిర్మించారు.