Bigg Boss 5 Telugu: లోబో మళ్లీ వచ్చేశాడు.. కంటితడి పెట్టుకున్న షణ్ముఖ్‌.. అసలు సిరి, జెస్సీల మధ్య ఏం జరిగింది.?

|

Oct 21, 2021 | 12:18 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఈ షో పట్ల అంత ఆసక్తి ఉంటుంది. హాలీవుడ్‌లో మొదలైన ఈ షో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంటోంది..

Bigg Boss 5 Telugu: లోబో మళ్లీ వచ్చేశాడు.. కంటితడి పెట్టుకున్న షణ్ముఖ్‌.. అసలు సిరి, జెస్సీల మధ్య ఏం జరిగింది.?
Biggboss Telugu
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఈ షో పట్ల అంత ఆసక్తి ఉంటుంది. హాలీవుడ్‌లో మొదలైన ఈ షో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంటోంది అంటే ఇందులో ఉండే ఎమోషన్స్‌ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు కలిసి మెలిసి ఉండే కంటెస్టెంట్స్‌ ఒకేసారి కోపంతో ఊగిపోతుంటారు. గొడవలకు దిగుతారు, కొట్టుకునే స్థాయికి వెళ్లిపోతారు. మళ్లీ వెంటనే కలుసుకొని నవ్వుకుంటారు. ఇలా ఊహించని షాక్‌లకు కేరాఫ్‌ అయిన బిగ్‌బాస్‌లో తాజాగా గురువారం కంటెస్టెంట్‌లకు బిగ్‌బాస్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. లోబో ఎలిమినేట్‌ అవ్వలేదని షో చూస్తున్న ప్రేక్షకులకు తెలిసినప్పటికీ.. హౌజ్‌మెట్స్‌కి మాత్రం తెలీదు.

దీంతో ఇన్ని రోజులు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోను గురువారం బిగ్‌బాస్‌ తిరిగి హౌజ్‌లోకి పంపించారు. ఈ క్రమంలోనే తాజాగా షో నిర్వహకులు కొత్త ప్రోమోను విడుదల చేశారు. లోబో మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌజ్‌మెట్స్‌ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేశారు. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకున్నాడు. ఇక బిగ్‌బాస్‌ పెట్టిన సీక్రెట్ టాస్క్‌ చిచ్చు.. షణ్ముఖ్‌, సిరి, జెస్సీల మధ్య గొడవకు దారి తీసినట్లు కనిపిస్తోంది. అందరూ టాస్క్‌ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్‌ వాపోయాడు.

ఇక జెస్సీ కెప్టెన్‌ కావాలనుకున్నాడని, దానికి సిరి సహాయం చేసిందని దాంతో తాను ఎదవను అయ్యానని కంటతడి పెట్టుకున్నాడు. అటు జెస్సీ, ఇటు సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్‌ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు. దీంతో సిరి కూడా ఏడ్చేసింది. ఇంతకీ వీరి ముగ్గురు మధ్య అసలేం జరిగింది.? ఇదంతా బిగ్‌బాస్‌ పెట్టిన చిచ్చు ఫలితమేనా తెలియాలంటే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Also Read: Viral Video: గున్న ఏనుగును రక్షించుకునేందుకు నీటి కొలనులో మొసలితో తలపడిన తల్లి ఏనుగు.. చివరకు గెలిచిందెవరో ఊహించగలరా?

Korean Drama: అమ్మాయిని ప్రేమించి మోసం చేశా క్షమించండి అంటున్న కిమ్ సియోన్-హో.. షోల నుంచి తొలగించిన ప్రొడక్షన్ టీం

100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..