కావేరి కాలింగ్.. ‘టైటానిక్’ హీరో సపోర్ట్

| Edited By:

Sep 24, 2019 | 12:25 PM

నదీ జలాల పరిరక్షణ కోసం కావేరీ కాలింగ్ పేరిట ఈషా ఫౌండేషన్ చేపట్టిన ఉద్యమానికి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో నదులు కనుమరుగయ్యే పరిస్థితితో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని.. దీన్ని మనమే కాపాడుకోవాలని చేపట్టిన ఆధ్యాత్మిక గురువు ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. దీనికి మద్దతు పలుకుతూ లక్షల మంది రైతులు కావేరీ నదీతీరప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సినిమా తారలు […]

కావేరి కాలింగ్.. ‘టైటానిక్’ హీరో సపోర్ట్
Follow us on

నదీ జలాల పరిరక్షణ కోసం కావేరీ కాలింగ్ పేరిట ఈషా ఫౌండేషన్ చేపట్టిన ఉద్యమానికి మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో నదులు కనుమరుగయ్యే పరిస్థితితో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని.. దీన్ని మనమే కాపాడుకోవాలని చేపట్టిన ఆధ్యాత్మిక గురువు ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. దీనికి మద్దతు పలుకుతూ లక్షల మంది రైతులు కావేరీ నదీతీరప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సినిమా తారలు ఎంతోమంది తమ మద్దతును ప్రకటించారు. కమల్ హాసన్, కంగనా, పునీత్ రాజ్ కుమార్, కాజల్, సమంత, రాధాకా శరత్ కుమార్, త్రిష, అమలాపాల్, ప్రణీత, జూహీ చావ్లా, సుహాసిని వంటి పలు భాషా నటీమణులు, నటులు కావేరి కాలింగ్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక తాజాగా ఈ ఉద్యమంపై హాలీవుడ్‌ నటుడు, టైటానిక్‌ హీరో లియోనార్డో డికాప్రియో స్పందించారు.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ మెసేజ్‌ పెట్టిన డికాప్రియో ‘కావేరి కాలింగ్‌’కు తన సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా డీకాప్రియోను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ గత ఏడాది మన దేశంలోనే జరిగిన ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. అటు పర్యావరణ పరిరక్షణపై కూడా స్పందించే హీరోలలో డికాప్రియో ముందు వరుసలో ఉంటారు. ‘క్లైమేట్ ఛేంజ్’ మీద తీసిన ఓ డాక్యుమెంటరీలో నటించిన ఆయన.. అందుకోసం ప్రతిసారి గళమెత్తుతుంటారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో క్లైమేట్ ఛేంజ్‌పై స్పీచ్‌ ఇచ్చిన ఆయన.. అందరిలో అవగాహనను పెంచారు. ఆ మధ్యన చెన్నైలో నీటి ఎద్దడిపై కూడా లియోనార్డో స్పందించారు. ‘ఇప్పటికైనా మనం మేలుకోవాలి’ అంటూ డికాప్రియో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.