Prabhas Adipurush movie: ఓమ్ రౌత్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటించనున్న చిత్రం ఆది పురుష్. ఇందులో లంకేషుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఇంద్రజిత్ పాత్రకు గానూ బాలీవుడ్ నటుడు అంగాద్ బేడీ నటించనున్నట్లు తెలుస్తోంది. (ఫుట్‌బాల్‌ని మీరు మరింత అందంగా తీర్చిదిద్దారు.. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’కి భారతీయ ప్రముఖుల నివాళి)
రామాయణం గురించి తెలిసిన వారికి ఇంద్రజిత్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్.. రాముడు, రావణాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పాత్రకు గానూ అంగాద్‌ని తీసుకున్నట్లు టాక్. ఇక మరోవైపు ఆది పురుష్ కోసం ప్రభాస్.. వర్కౌట్లు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. (మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్న చిరంజీవి.. కొరటాలకు మరో సూచన..!)
కాగా లెజండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కుమారుడైన అంగాద్ బేడి.. పింక్, డియర్ జిందగీ, టైగర్ జిందా హై, గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ సినిమాల్లో నటించిన అంగాద్.. బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సాధించుకున్న విషయం తెలిసిందే. (Bigg Boss 4 Teugu : ఈ వారం ‘నో’ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అప్పుడేనా..!)