డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్‌కు కూకట్‌పల్లి కోర్టు జరిమానా విధించింది. ఈ నెల 24న ప్రిన్స్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసు నిమిత్తమై ఇవాళ అతడు కూకట్‌పల్లి కోర్టుకు హాజరుకాగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు జరిమానా విధించింది. కాగా ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రిన్స్.. ‘బస్టాప్’, ‘నేను శైలజ’, ‘రొమాన్స్’, ‘మిస్టర్’ వంటి చిత్రాల్లో కనిపించాడు. అలాగే ‘బిగ్‌బాస్’ మొదటి సీజన్‌లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రిన్స్.