మహేశ్‌ హీరోయిన్‌కు కరోనా నెగిటివ్.. సోషల్ మీడియా కేంద్రంగా వెల్లడించిన అందాల భామ..

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత

మహేశ్‌ హీరోయిన్‌కు కరోనా నెగిటివ్.. సోషల్ మీడియా కేంద్రంగా వెల్లడించిన అందాల భామ..

Updated on: Dec 20, 2020 | 5:57 AM

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది ఈ అమ్మడు. వన్ సినిమాలో తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తించిన ఈ భామ ఇటీవల కరోనాకు గురైన విషయం అందరికి తెలిసిందే. తాజాగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అభిమానులకు తీపి కబురు తెలియజేసింది ఈ అమ్మడు.

కృతిసనన్ లుక్కా చుప్పి సినిమాలో షూటింగ్‌ చండీగఢ్‌లో కొనసాగుతుండగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తనే ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి ముంబైలోని తన నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉండి సరైన చికిత్స తీసుకుంది. హోమ్ క్వారంటైన్ ముగిసిన తర్వాత కరోనా పరీక్షలు చేసుకోగా నెగిటివ్ వచ్చిందని ప్రకటించింది. తెలుగులో సరైనా అవకాశాలు లేక బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ అక్షయ్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. తాజాగా ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ లో కృతిసనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.