యువ దర్శకులకు వరం… విజయ్ నిర్ణయం

| Edited By:

May 13, 2019 | 6:21 PM

తమిళనాట తిరుగులేని కథానాయకుడిగా రజనీ ఒక వెలుగు వెలుగుతున్నారు. సుదీర్ఘమైన తన కెరియర్లో ఎంతోమంది అగ్రదర్శకులతో కలిసి సినిమాలు చేసిన ఆయన, ఈ మధ్య కాలంలో యువదర్శకులకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన ‘కబాలి’ .. ‘కాలా’ .. ‘పేట’ సినిమాలతో సందడి చేశారు. అదే బాటలో అడుగులు వేయడం మొదలుపెట్టిన విజయ్, ఈ విషయంలో మరింత వేగాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కోలీవుడ్లో వినికిడి. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తోన్న విజయ్, […]

యువ దర్శకులకు వరం... విజయ్ నిర్ణయం
Follow us on

తమిళనాట తిరుగులేని కథానాయకుడిగా రజనీ ఒక వెలుగు వెలుగుతున్నారు. సుదీర్ఘమైన తన కెరియర్లో ఎంతోమంది అగ్రదర్శకులతో కలిసి సినిమాలు చేసిన ఆయన, ఈ మధ్య కాలంలో యువదర్శకులకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన ‘కబాలి’ .. ‘కాలా’ .. ‘పేట’ సినిమాలతో సందడి చేశారు. అదే బాటలో అడుగులు వేయడం మొదలుపెట్టిన విజయ్, ఈ విషయంలో మరింత వేగాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కోలీవుడ్లో వినికిడి. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తోన్న విజయ్, ఈ సినిమా తరువాత కూడా యువ దర్శకులతో వరుస సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. కథా కథనాలు కొత్తగా వుంటాయనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని, తన సన్నిహితుల ద్వారా సంకేతాలు పంపించాడట. దాంతో యువ దర్శకులు కొత్త కథలపై కసరత్తులు మొదలెట్టారని తెలిసింది.