Tollywood: 150కి పైగా సినిమాలు.. చివరకు అంత్యక్రియలకు డబ్బులేక అనాధలా.. ఈ హీరోయిన్ ఎలా చనిపోయిందో తెలుసా ?

సినీరంగుల ప్రపంచంలో గుర్తింపు రావడం అంత సహజమేమి కాదు. ఎన్నో సవాళ్లు దాటుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు సక్సెస్ అయిన తర్వాత కనిపించకుండా పోతారు. అలాగే మరికొందు విధి రాతకు బలవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. లక్షల పారితోషికం తీసుకుని చివరకు అంత్యక్రియలకు డబ్బులు లేని స్థితికి చేరుకుంది.

Tollywood: 150కి పైగా సినిమాలు.. చివరకు అంత్యక్రియలకు డబ్బులేక అనాధలా.. ఈ హీరోయిన్ ఎలా చనిపోయిందో తెలుసా ?
Ashwini

Updated on: Aug 20, 2026 | 7:13 PM

వెండితెరపై ఒకప్పుడు మెరిసిన నక్షత్రం అశ్విని. సినిమాల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సహజ నటన, ఆకట్టుకునే రూపంతో కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే సినీ గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. వందలాది మంది అభిమానుల మనసులను గెలుచుకుని, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె జీవితం చివరికి ఇంతటి విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. నెల్లూరుకు చెందిన అశ్విని, అలనాటి మహానటి భానుమతి దర్శకత్వంలో వచ్చిన ‘భక్త ధ్రువ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలోనే ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకనిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు. బాలకృష్ణ సరసన ‘భలే తమ్ముడు’, వెంకటేష్‌తో ‘కలియుగ పాండవులు’ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి, అప్పట్లో భారీ పారితోషికం అందుకున్నారు. ఒకానొక దశలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అశ్విని పేరు మార్మోగిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

అయితే, రంగుల ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకట్లు ఆమె జీవితాన్ని కబళించాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, వివాహ బంధంలో మోసపోవడం ఆమెను మానసికంగా కృంగదీశాయి. ఆర్థికపరమైన ప్రణాళికలు లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన ఆమె, తనకున్న ఆస్తులను కోల్పోయి అద్దె ఇంటికి మారాల్సిన దుస్థితికి చేరుకున్నారు. చివరి రోజుల్లో ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డారు. 2012లో తన 45వ ఏటనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అశ్విని మరణం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందంటే, ఆమె పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేని దుర్భర పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో నటుడు, దర్శకుడు పార్థిబన్ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

ఏ రంగమైనా కష్టపడి పైకి రావడం ఎంత ముఖ్యమో, సంపాదించిన దానిని భవిష్యత్తు కోసం జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని అశ్విని జీవితం మనకు మరోసారి గుర్తుచేస్తోంది. ఒకప్పుడు లక్షల్లో సంపాదించిన నటి, చివరికి అనాథలా కన్నుమూయడం సినీ పరిశ్రమలో ఎప్పటికీ ఒక తీరని విషాదంగా మిగిలిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Loading...
Unable to load recommendations.
Follow Us