
సినీరంగంలో ఎంతో మంది హీరోయిన్స్ తమ అందం, అభినయంతో చెరగని ముద్ర వేశారు. అయితే కొందరు సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్, అందంతో కట్టిపడేస్తున్నారు. అలాగే కొందరి జీవితాల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘మదర్ ఇండియా’లో నటి నర్గీస్ సునీల్ దత్ తల్లి పాత్రను పోషించారు, ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన కథనే నటి మాధురీ దీక్షిత్ విషయంలో కూడా జరిగింది. అవును.. ఆమె వేర్వేరు సమయాల్లో అటు నటుడు వినోద్ ఖన్నా , ఇటు అతని కుమారుడు అక్షయ్ ఖన్నా ఇద్దరితోనూ తెరపై కలిసి పనిచేశారు. 90వ దశకంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మాధురి దీక్షిత్.. 1988లో విడుదలైన ‘దయవాన్’ చిత్రంలో వినోద్ ఖన్నా భార్య పాత్రను పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
అలాగే ‘దయవాన్’ సినిమా విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత, మాధురీ దీక్షిత్ మరోసారి ఖన్నా కుటుంబానికి చెందిన నటుడితో కలిసి తెరపై కనిపించారు. 1997లో విడుదలైన ‘మొహబ్బత్’ చిత్రంలో, ఆమె వినోద్ ఖన్నా కుమారుడు అక్షయ్ ఖన్నా సరసన కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, అక్షయ్ ఖన్నాల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి. మాధురీ దీక్షిత్ మొదట వినోద్ ఖన్నాతో, ఆ తర్వాత అతని కుమారుడు అక్షయ్ ఖన్నాతో ఒక సినిమాలో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఇదెలా ఉంటే.. ఇప్పటికీ మాధురీ సినీరంగంలో చాలా చురుగ్గా ఉన్నారు. బుల్లితెరపై చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డార్క్-కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘మా బెహన్’లో ఆమె కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె వయసు 59 సంవత్సరాలు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..