Actor Nassar : స్టార్ హీరో కావాల్సిన కొడుకు.. 12 ఏళ్లుగా మంచానికే పరిమితం.. ఆ ఒక్క హీరో పేరే గుర్తుంటుంది..

దశాబ్దాలుగా దక్షిణాది సినిమా ప్రపంచంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నాజర్. తండ్రిగా, అన్నగా, మామగా, తాతగా, భర్తగా ఇలా ఒక్కటేమిటీ ఎన్నో క్యారెక్టర్స్.. అలాగే పవర్ ఫుల్ విలనిజంతో వెండితెరపై సినీప్రియులను అలరించారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. కానీ ఈ నటుడి జీవితంలో తీరని విషాదం ఉంది. ఆ నవ్వు వెనుక తీరని కష్టం దాగి ఉందని మీకు తెలుసా.. ?

Actor Nassar : స్టార్ హీరో కావాల్సిన కొడుకు.. 12 ఏళ్లుగా మంచానికే పరిమితం.. ఆ ఒక్క హీరో పేరే గుర్తుంటుంది..
Nassar

Updated on: Sep 06, 2026 | 8:08 AM

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందులో నటుడు నాజర్ ఒకరు. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆన దాదాపు ఆరు భాషలలో 600లకు పైగానే సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ వరుస సినిమాలతో తెరపై అందరినీ అలరిస్తున్నారు. అయితే తన నటనతో తెరపై సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసే నాజర్ జీవితంలో తీరని కష్టం ఉందని మీకు తెలుసా.. ? తన నటనతో నవ్వించే నాజర్ నవ్వు వెనుక ఎప్పటికీ తీరని దుఃఖం దాగి ఉంది. 1985లో నటుడిగా తెరంగేట్రం చేసిన నాజర్ తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

అయితే నాజర్ తనలాగే తన వారసురాలను సైతం ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నాడు. ముఖ్యంగా తన పెద్ద కొడుకుకు యాక్టింగ్ అంటే ఆసక్తి ఉండడంతో హీరోగా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నాడు. నాజర్ కు ముగ్గురు కొడుకులు కాగా.. పెద్ద కుమారుడి పేరు అబ్దుల్ ఫైజల్ హాసన్. కొడుకు హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసి అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాడు నాజర్. అదే సమయంలో అబ్దుల్ ఫైజల్ ప్రయాణిస్తున్న కారు పెద్ద ప్రమాదానికి గురైంది. అబ్దుల్ ప్రాణాలతో బయటపడినప్పటికీ 14 రోజులు కోమాలోనే ఉండిపోయాడు. అప్పటి నుంచి పూర్తిగా వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

కొడుకు విషయంలో నాజర్ పూర్తిగా కుంగిపోయాడు. అలాగే అబ్దుల్ ఫైజల్ తన జీవితంలో అన్ని విషయాలను, చివరకు ఫ్యామిలీని కూడా మర్చిపోయాడు. కేవలం ఒక్క విజయ్ దళపతి పేరు మాత్రం మర్చిపోలేదు. టీవీలో విజయ్ పాట వచ్చినా, సినిమా వచ్చినా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం తెలిసి విజయ్ సైతం స్వయంగా నాజర్ పెద్ద కొడుకును కలిశాడు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

Loading...
Unable to load recommendations.
Follow Us