ఆ స్టార్ హీరో నో చెప్పడం వల్లే పవన్ సినిమాలో దగ్గుబాటివారబ్బాయికి ఛాన్స్ దక్కిందా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Rajeev Rayala
  • Publish Date - 8:45 pm, Wed, 23 December 20
ఆ స్టార్ హీరో నో చెప్పడం వల్లే పవన్ సినిమాలో దగ్గుబాటివారబ్బాయికి ఛాన్స్ దక్కిందా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

మలయాళంలో బిజీమీనన్ పోషించిన పోలీస్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో రానా కనిపిస్తాడు. అయితే రానా పోషిస్తున్న పాత్రకు ముందుగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ను సంప్రదించారట. మొదట్లో సుదీప్ ను సంప్రదించగా  వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసాడట సుదీప్. దీంతో మేకర్స్ దగ్గుబాటి రానాని ఆ పాత్ర కోసం తీసుకున్నారని ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్,సుదీప్ లకి మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.