మలయాళ హీరోయిన్ పై లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్ కుమార్ భార్య నటి కావ్య మాధవన్‌ను సోమవారం భార్య కావ్య మాధవన్‌ను కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. 2017లో ప్రముఖ హీరోయిన్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్‌తోపాటు.. అతని బంధువులు సూరజ్, శరత్‌లను అదుపులోకి తీసుకున్నారు కేరళ పోలీసులు. ఇటీవల ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్ బావమరిది సూరజ్, శరత్‌లకు సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడంతో.. ఈ కేసులో నటి కావ్య మాధవన్ ప్రమేయం ఉన్నట్లుగా కేరళ పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను మరోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.. సోమవారం కావ్య మాధవన్‌ను పోలీసులు దాదాపు 4 గంటలు ఆమెను విచారించినట్లుగా తెలిపారు.
గతంలోనూ కావ్యకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు కేరళ పోలీసులు.. అయితే తాను చెన్నైలో ఉన్నందున విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో విచారణ వాయిదా పడింది. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఆమె.. ఆలువాలోని తన నివాసంలో విచారణ చేపట్టాలని కోరడంతో పోలీసులు సోమవారం ఆమెను తన నివాసంలో విచారించారు.. విచారణ సమయంలో కావ్య కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని.. తనకు గుర్తులేవని తెలిపిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నటి కావ్య మాధవన్‌కు మే 30లోగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టు గడువు విధించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..
Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట