తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల కరోనా భారీన పడ్డారు. దీంతో ఆయన అభిమానులలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సూర్య ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. దీంతో సూర్య ఆరోగ్యం పై అతని తమ్ముడు కార్తీ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇంటికి తిరిగొచ్చారు. ఇంకా కొద్ది రోజులు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటారు. మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలకు థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట అని కార్తీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీంతో సూర్య ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేశారంటే.. ఆయన ఆరోగ్యం మెరుగైందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య సూపర్ హిట్ సాధించారు. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్, సూరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నాడు.
Anna is back home and all safe! Will be in home quarantine for a few days. Can’t thank you all enough for the prayers and best wishes!
— Actor Karthi (@Karthi_Offl) February 11, 2021
Also Read:
Uppena: ‘ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!