‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

బాలీవుడ్ అనగానే మనకు మెరిసే మేకప్, ఖరీదైన జిమ్ములు, విదేశీ పండ్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా కరీనా కపూర్ ఖాన్ లాంటి స్టార్ హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఏవేవో వింత వింత ఆహారాలు తీసుకుంటారని మనం అందరూ అనుకుంటాం.

‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్
B Town Star Heroine

Updated on: Jan 22, 2026 | 6:45 AM

కానీ అసలు విషయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. కరీనా తన ఫిట్‌నెస్ కోసం, ముఖ్యంగా తన జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఎక్కడికో వెతకలేదట. మన వంటింట్లో మనం అస్సలు ఇష్టపడని, చూడగానే ముఖం తిప్పుకునే ఒక సాధారణ కూరగాయనే ఆమె తన “సూపర్ పవర్” అని పిలుస్తోంది. మందుల కంటే ఆ కూరగాయతో చేసే సూప్ లేదా సలాడ్ కే ఆమె ప్రాధాన్యత ఇస్తుందట. ఇంతకీ ఆ హీరోయిన్ మనసు గెలుచుకున్న ఆ కూరగాయ ఏంటి?

ఆనపకాయే నా సూపర్ పవర్..

బెబో కరీనా కపూర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “నేను లౌకీ (ఆనపకాయ లేదా సొరకాయ) కి పెద్ద ఫ్యాన్‌ని. ఇది నా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అప్పుడప్పుడు నాకు అనారోగ్యంగా అనిపిస్తే మందులు వేసుకోవడానికి బదులు సొరకాయ సూప్ లేదా సలాడ్ తీసుకుంటాను. ఇది అంత గ్లామరస్‌గా అనిపించకపోవచ్చు కానీ, నాకు మాత్రం ఇది ఒక సూపర్ పవర్ వెజిటబుల్” అని కరీనా చెప్పుకొచ్చారు. పొలం నుండి నేరుగా వచ్చే ఆ రుచి తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

థానేలోని కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ కూడా కరీనా మాటలను సమర్థిస్తున్నారు. ఆనపకాయ అనేది భారతీయులు తరతరాలుగా వాడుతున్న అద్భుతమైన ఆహారమని ఆమె పేర్కొన్నారు. తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా, ప్రస్తుతం ట్రెండీగా వినిపిస్తున్న చాలా విదేశీ ఆహారాల కంటే ఇందులో పోషకాలు ఎక్కువని ఆమె వివరించారు.

Kareena Kapoor.. Khan

  • హైడ్రేషన్: ఆనపకాయలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.
  •  మెటబాలిజం బూస్టర్: ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  •  బీపీ నియంత్రణ: ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి వరం..

ఎవరైతే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఆనపకాయ ఒక దివ్యౌషధం. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది కానీ ఒంటికి కొవ్వు పట్టనివ్వదు. జబ్బు పడిన వారు కోలుకోవడానికి, నీరసాన్ని వదిలించుకోవడానికి కూడా ఇది ఎంతో తోడ్పడుతుంది. అందుకే వేసవి కాలంలోనే కాకుండా వర్షాకాలంలో కూడా ఈ కూరగాయను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్లామర్ లోకంలో ఉన్నా సరే కరీనా కపూర్ మన ప్రాచీనకాలం నాటి ఇంటి వంటకానికే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.