SHANI MAHADEVAPPA: కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నటుడు మృతి..

|

Jan 04, 2021 | 4:57 PM

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. కన్నడ ప్రముఖ నటుడు శని మహదేవప్ప (88) కరోనాతో జనవరి 3న మృతిచెందారు.

SHANI MAHADEVAPPA: కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నటుడు మృతి..
Follow us on

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఈ మహమ్మారి భారిన పడి మలయాళ పాట రచయిత అనిల్ పనాచూరన్ మృతి చెందిన విషయం మరువక ముందే మరో నటుడు ఈ వైరస్‏కు బలయ్యాడు. కన్నడ ప్రముఖ నటుడు శని మహదేవప్ప (88) కరోనాతో జనవరి 3న మృతిచెందారు. గత వారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‏గా నిర్దారణ అయ్యింది. దీంతో శని మహదేవప్ప మరణం పట్ల కన్నడ సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా వయోభార సమస్యలతో బాధపడుతున్నా శని మహదేవప్ప.. ఇటీవల బెంగుళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటిన్ వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు శని మహదేవప్ప. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. శని మహదేవప్ప మృతిపై ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1962లో శనిమహదేవప్ప కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. శంకర్ గురు, ఒంటి సలగ, శ్రీ శ్రీనివాస కళ్యాణం, శివశంకర్, కవిరత్న కాళిదాస వంటి సినిమాల్లో ఆయన నటించారు. ఇక శని మహదేవప్ప అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు.