సేమ్ యాక్టింగ్.. చిరాగ్గా ఉంది: కంగనా

| Edited By:

Apr 12, 2019 | 12:33 PM

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి తన కామెంట్లతో వార్తల్లో నిలిచింది. నటి ఆలియా భట్‌ నటనను ఉద్ధేశిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు. ఓటింగ్‌లో కంగానానే ఉత్తమ హీరోయిన్‌గా గెలిచినట్లు […]

సేమ్ యాక్టింగ్.. చిరాగ్గా ఉంది: కంగనా
Follow us on

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి తన కామెంట్లతో వార్తల్లో నిలిచింది. నటి ఆలియా భట్‌ నటనను ఉద్ధేశిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు.

ఓటింగ్‌లో కంగానానే ఉత్తమ హీరోయిన్‌గా గెలిచినట్లు సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని కంగనా దగ్గర ప్రస్తావించగా.. తనకు పోటీగా అలియా ఉందనే విషయం తల్చుకుంటేనే తనకు చాలా చిరాగ్గా ఉందన్నారు. గల్లీ బాయ్ చిత్రంలో అలియా నటన సగటు హీరోయిన్ యాక్టింగ్‌లానే ఉందన్నారు కంగనా. మిగతా సినిమాల్లో ఎలా నటించిందో.. ఈ చిత్రంలోనూ అలానే యాక్ట్ చేసిందని కామెంట్స్ చేసింది కంగనా.