కాంట్రవర్సీ క్వీన్ కు కోర్టులో ఊరట.. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చిచెప్పిన న్యాయస్థానం

సినిమాలతోకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. సుశాంత్ సింగ్ మరణం

కాంట్రవర్సీ క్వీన్ కు కోర్టులో ఊరట.. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చిచెప్పిన న్యాయస్థానం

Updated on: Dec 22, 2020 | 9:00 PM

సినిమాలతోకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్. సుశాంత్ సింగ్ మరణం తరవాత కంగన అటు బాలీవుడ్ పెద్దలతో ఇటు రాజకీయనాయకులతో వివాదాలు పెట్టుకుంటూ నిత్యం వార్తల్లోనిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ముంబై హైకోర్ట్ లో ఊరట లభించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగన చేస్తోందని, తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టుకంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయడం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది. ట్విట్టర్ లో ఎవరికైనా ఖాతా ఉండొచ్చని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని చెప్పింది. తీర్పును జనవరి 7న వెలువరిస్తామని కోర్టు తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us