Nandamuri Kalyan Ram : సరికొత్త లుక్‌‌‌‌‌‌లో అదరగొడుతున్న నందమూరి హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు కళ్యాణ్ రామ్.

Nandamuri Kalyan Ram : సరికొత్త లుక్‌‌‌‌‌‌లో అదరగొడుతున్న నందమూరి హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Updated on: Jan 05, 2021 | 8:19 AM

Nandamuri Kalyan Ram :నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇక తన సినిమాల్లో సరికొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు కళ్యాణ్ రామ్. చివరగా కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంతమంచివాడవురా.!’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేక పోయింది. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక సరైన హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు ‘రావణ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తన లుక్ ను మార్చుకుంటున్నాడు. ఈ సినిమాతోపాటు దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఇటీవల అభిమానుల కంటపడ్డారు. గుబురు గడ్డంతో పెరిగిన జుత్తుతో రూఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటికి వచ్చాయి. జిమ్ నుంచి బయటికి వస్తూ చెమటోడుస్తూ ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ లుక్ ఏ సినిమాకోసమనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

also read : Tuck Jagadish : డబ్బింగ్ పనులు ప్రారంభించిన నాని.. త్వరలో ‘టక్‌ జగదీష్’గా రానున్న నేచురల్ స్టార్