Kinnerasani movie : కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లిమ్స్

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. 'విజేత' సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా అడుగు పెట్టాడు...

Kinnerasani movie : కళ్యాణ్ దేవ్ హీరోగా కిన్నెరసాని.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ గ్లిమ్స్

Updated on: Jan 01, 2021 | 6:13 PM

Kinnerasani movie First Glimpse : మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ‘విజేత’ సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా అడుగు పెట్టాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ‘సూపర్ మచ్చి’ అనే సినిమా చేస్తున్నాడు దేవ్. ఈ సినిమాతోపాటు ‘కిన్నెరసాని’ అనే సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

‘కిన్నెరసాని’ సినిమాకు ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంవహిస్తున్నాడు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ గ్లిమ్స్ లో హీరో ఒక చోట పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఎదో ఆలోచిస్తున్నట్టు చూపించారు. తనలో ఉన్న బాధ పాట రూపంలో వెనుక ప్లే అవుతుంది. మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

also read : Sreekaram Movie : కొత్త సంవత్సరానికి ఇలా ‘శ్రీకారం’.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్