AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను కలిసిన కొత్తలో గౌతమ్‌ ఎలా ఉండేవాడంటే.. భర్త గురించి మరిన్ని విషయాలు చెప్పిన కాజల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్ గతనెలాఖరున గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

నేను కలిసిన కొత్తలో గౌతమ్‌ ఎలా ఉండేవాడంటే.. భర్త గురించి మరిన్ని విషయాలు చెప్పిన కాజల్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2020 | 11:27 AM

Share

Kajal Gautam Kitchlu: టాలీవుడ్‌ చందమామ కాజల్ గతనెలాఖరున గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని కూడా పాటించి.. మరోసారి ఇక్కడి వారి అభిమానాన్ని చూరగొనింది కాజల్‌. కాగా పెళ్లి తరువాత గౌతమ్‌తో ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను చందమామ తెలిపింది. తమకు పదేళ్లుగా సాన్నిహిత్యం ఉందని.. మొదటి మూడు సంవత్సరాలు డేటింగ్ చేశామని, తరువాత ఏడు సంవత్సరాలు ఫ్రెండ్స్‌గా ఉన్నామని వివరించింది. ఇక లాక్‌డౌన్‌లో ఒకరిని ఒకరం బాగా మిస్‌ అయ్యామని.. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. (ఈ ఏడాది ఐపీఎల్‌తో బీసీసీఐకి భారీ ఆదాయం.. ఏకంగా 4వేల కోట్ల రెవెన్యూ)

ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో గౌతమ్‌ గురించి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చింది కాజల్‌. ”మా ఇద్దరి మనసులు చాలా దగ్గరయ్యాయి. అందుకే మా బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకొని పెళ్లి చేసుకున్నాము. గౌతమ్‌ చాలా పద్దతిగల వ్యక్తి. ముందు నా తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకున్నాడ. ఆ తరువాత నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోను” అని చెప్పుకొచ్చారు. ఇక తాను కలిసిన కొత్తలో గౌతమ్ అస్సలు సినిమాలు చూసే వాడు కాదని.. ఆ తరువాత అతడిని కూర్చోబెట్టి సినిమాలు చూపించడం స్టార్ట్ చేశానని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్లి వచ్చిన కాజల్‌.. ఇప్పుడు సినిమా షూటింగ్‌ల కోసం రెడీ అవుతోంది. (ఢిల్లీలో పెరగుతున్న కరోనా కేసులు.. పంజాబీ బస్తీ, జనతా మార్కెట్ మూసివేయాలంటూ ఆదేశాలు)

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!