కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కూడా కేజీఎఫ్ లా గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. ఇక కేజీఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ప్రభాస్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. సలార్ సినిమా తర్వాత కూడా తెలుగులోనే సినిమా చేయాలనీ చుస్తున్నాడట ప్రశాంత్ నీల్.
అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో మూవీ అవ్వగానే కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ఉంటుందని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా ఉంటుందని ఫిలింనగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2022లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్లతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీలను తెరకెక్కించాలని చూస్తున్నాడు.