John Arm Google map: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్ అబ్రహం చెయ్యి.. గూగుల్ మ్యాప్ అంటున్న ఫ్యాన్స్

బాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తన కండరాల చేతిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో జాన్ అబ్రహం చేతి కండరాల తీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు...

John Arm Google map: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్ అబ్రహం చెయ్యి.. గూగుల్ మ్యాప్ అంటున్న ఫ్యాన్స్

Updated on: Jan 16, 2021 | 4:50 PM

John Arm Google map: బాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తన కండరాల చేతిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో జాన్ అబ్రహం చేతి కండరాల తీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జాన్ ఎడమ చేయి కండరాల మధ్యలో స్పష్టంగా కనిపించే సిరలతో ఆ ఫోటో అందరినీ ఆకర్షిస్తుంది. ఇది జాన్ అబ్రహం చేయి కాదు అంటూ ఈ చిత్రాన్ని మొదట తన సత్యమేవ జయతే 2 దర్శకుడు మిలాప్ జావేరి షేర్ చేశారు. మరో అభిమాని “గూగుల్ మ్యాప్స్” అని కామెంట్ చేయగా మరొకరు “మీ నుండి రక్త పరీక్ష చేయటానికి మంచి సిరలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇంతలో.. టైగర్ ష్రాఫ్ “పిచ్చివాడు” అని సరదాగా కామెంట్ పెట్టాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పిక్. సత్యమేవ జయతే 2 గత ఏడాది గాంధీ జయంతి కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేక పోయింది చిత్ర బృందం. దీంతో ఈ సినిమా ను మే 12 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. మరో వైపు జాన్ ఓ అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీలో బైక్ రేసర్ గా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ కొత్త సినిమా సలార్ లో విలన్ గా నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

Also Read: ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ లవబుల్ కపుల్..

Loading...
Unable to load recommendations.
Follow Us