ఫ్యాన్స్‌కి భయపడి రజనీ సినిమాను వదులుకున్న స్టార్ నటుడు..!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమాలో అవకావం వస్తే వదులుకునేందుకు ఎవ్వరూ అంత ఆసక్తిని చూపరు. వేరే సినిమా డేట్లు అడ్జెస్ట్ చేసైనా సరే రజనీ మూవీలో నటించాలనుకుంటారు. అయితే ఆయన ఫ్యాన్స్‌కి భయపడి ఓ స్టార్ హీరో రజనీ మూవీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశారు ఆయన. ఇంతకు ఆ నటుడు ఎవరంటే జయరామ్‌. మలయాళంలో మంచి పేరున్న ఈ నటుడు తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో మెరిశారు. ఇక రజనీకాంత్ హీరోగా […]

ఫ్యాన్స్‌కి భయపడి రజనీ సినిమాను వదులుకున్న స్టార్ నటుడు..!

Edited By:

Updated on: Jun 08, 2020 | 1:05 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమాలో అవకావం వస్తే వదులుకునేందుకు ఎవ్వరూ అంత ఆసక్తిని చూపరు. వేరే సినిమా డేట్లు అడ్జెస్ట్ చేసైనా సరే రజనీ మూవీలో నటించాలనుకుంటారు. అయితే ఆయన ఫ్యాన్స్‌కి భయపడి ఓ స్టార్ హీరో రజనీ మూవీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశారు ఆయన. ఇంతకు ఆ నటుడు ఎవరంటే జయరామ్‌.

మలయాళంలో మంచి పేరున్న ఈ నటుడు తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో మెరిశారు. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ముత్తు సినిమాలో శరత్ బాబు పాత్ర కోసం ముందుగా జయరామ్‌ను సంప్రదించారట దర్శకుడు కేఎస్‌ రవికుమార్. రజనీ సినిమా కాబట్టి ఆయన వెంటనే ఓకే చెప్పారట. అయితే ఓ సన్నివేశంలో రజనీని చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుందని దర్శకుడు చెప్పారట. కానీ ఆ పని చేయలేనని చెప్పిన జయరామ్‌, ఆ మూవీ నుంచి తప్పుకున్నారట. ఎందుకంటే సినిమాలో అయినా సరే రజనీని చెంప దెబ్బ కొడితే అభిమానులు తట్టుకోలేరని, వాళ్లకు భయపడే ఈ మూవీని వదులుకున్నానని ఆయన చెప్పారు.

అయితే ఆయన భయంలోనూ నిజం లేకపోలేదు. ఎందుకంటే రజనీకి భారీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఉంటుంది. పడయప్పా(తెలుగులో నరసింహ)లో విలన్‌గా నటించిన రమ్యకృష్ణ.. ఆ మూవీలో కొన్ని సన్నివేశాల్లో రజనీని అవమానిస్తుంది. దీంతో కోపం పెంచుకున్న రజనీ ఫ్యాన్స్‌ చెన్నైలో ఓ సారి ఆమెపై దాడికి ప్రయత్నించారు. అంతకుముందు కూడా అలాంటి ఉదంతాలు చాలానే జరిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: చెర్రీతో పెళ్లైన కొత్తలో ఇబ్బందులు పడ్డా..!