Anudeep KV: జాతి రత్నాలు డైరెక్టర్‌ పెద్ద స్కెచ్‌ వేశాడుగా.. బడా హీరో కోసం కథ సిద్ధం చేసిన అనుదీప్‌..

|

Aug 28, 2022 | 7:28 AM

Anudeep KV: చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్‌ను అందుకుంది జాతి రత్నాలు సినిమా. అస్సలు విడుదల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత సంచలనం...

Anudeep KV: జాతి రత్నాలు డైరెక్టర్‌ పెద్ద స్కెచ్‌ వేశాడుగా.. బడా హీరో కోసం కథ సిద్ధం చేసిన అనుదీప్‌..
Anudeep
Follow us on

Anudeep KV: చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్‌ను అందుకుంది జాతి రత్నాలు సినిమా. అస్సలు విడుదల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర దర్శకుడు అనుదీప్‌ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

సినిమాలో కథ లేకపోయినా కేవలం కథనం, కామెడీతోనే హిట్‌ కొట్టాడు అనుదీప్‌. దీంతో కొన్ని రోజులు ఈ యంగ్‌ డైరెక్టర్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో అనుదీప్‌ తర్వాత చిత్రం ఏంటన్నదానిపై అందరి దృష్టి పడింది. అయితే ఇప్పటి వరకు అనుదీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుదీప్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా చేయాలనే ప్లాన్‌ ఉన్నానని తెలిపాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని అనుదీప్‌ తెలిపాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే వెంకీ మామ.. అనుదీప్‌ డైరెక్షన్‌లో నటిస్తే థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి అనుదీప్‌ చెప్పిన కథ వెంకీకి నచ్చుతుందా.? ఆ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా.? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే వెంకీ ప్రస్తుతం బాలీవుడ్ లో `కభీ ఈద్ కభీ దివాళీ` సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..