Oscars 2021: ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘జల్లికట్టు’.. భారత సినిమాకు మరోసారి తీవ్ర నిరాశే..

|

Feb 10, 2021 | 11:57 AM

మరోసారి భారత సినిమాకు నిరాశే ఎదురైంది. మన దేశం నుంచి 93వ ఆస్కార్ అవార్డులకు బరిలో నిలిచిన 'జల్లికట్టు' సినిమా తుది రౌండకు అర్హత సాధించలేకపోయింది.

Oscars 2021: ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న జల్లికట్టు.. భారత సినిమాకు మరోసారి తీవ్ర నిరాశే..
Follow us on

మరోసారి భారత సినిమాకు నిరాశే ఎదురైంది. మన దేశం నుంచి 93వ ఆస్కార్ అవార్డులకు బరిలో నిలిచిన ‘జల్లికట్టు’ సినిమా తుది రౌండకు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ అవార్డుల కోసం భారతీయ భాషల్లోని మొత్తం 27 సినిమాలు పోటీపడగా.. మలయాళ సినిమా అయిన ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ తుది రౌండ్‏లో ఎంపికలేకపోయింది. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘుచిత్రం విభాగంలో ‘బిట్టు’..తర్వాతి రౌండుకు ఎంపికైంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది.

సామాజిక నేపథ్య కథాంశంతో జోస్ పెల్లీస్సరీ ‘జల్లికట్టు’ను తెరకెక్కించాడు. 2019లో పలు భాషా ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. అదే సంవత్సరంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో ప్రదర్శితమైన విమర్శకుల మెప్పును సైతం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జల్లికట్టు సినిమాకుగానూ.. ఉత్తమ దర్శకుడిగా జోస్ పెల్లీస్సరీ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రలలో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న ఓ దున్నపోతు ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఎంతటి వినాశనం చేసిందనేది కథాంశం. ఇక ఈ సినిమా మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఇందులో దున్నపోతును ఉపయోగించకపోవడం గమనార్హం. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ ద్వారా ఓ దున్నపోతును తయారు చేసి వాడరట. ఒక్కో దున్నపోతుకు సుమారు 20 లక్షలు ఖర్చు అయ్యిందట.

Also Read:

Rajinikanth Annaathe : సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ సినిమాకు అనుకోని బ్రేకులు.. త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్న షూటింగ్..