బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కొత్త ఇల్లు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన డిజైనర్..

బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కొత్త ఇల్లు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన డిజైనర్..

బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్ మరియు కరీనా కపూర్ రెండవ సారి మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అంతేకాకుండ త్వరలోనే ఈ జంట

Rajitha Chanti

|

Jan 16, 2021 | 11:58 AM

బాలీవుడ్ స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్ మరియు కరీనా కపూర్ రెండవ సారి మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అంతేకాకుండ త్వరలోనే ఈ జంట తమ కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారు. ఇటీవల కరీనా తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోను ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్‏గా మారింది.

సైఫ్ పూర్వీకుల ఆస్తి అయిన పట్యాడ ప్యాలెస్ పునర్మిణం కోసం పనిచేసిన డిజైనర్ దర్శిని షా.. ప్రస్తుతం సైఫ్ కొత్త ఇల్లు డిజైనర్‏గా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శిని షా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ఇంటి గురించి కొన్ని ఆకక్తికర విషయాలను తెలిపారు. “సైఫ్ మరియు కరీనా కపూర్ వాళ్ళ పాత ఇంటిని వదలడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం వారి కొత్త ఇల్లు కూడా పాత ఇంట్లో ఉన్నామనే భావన కలిగేలా దీనిని డిజైన్ చేశాం. అంతేకాకుండా వారికి జన్మించబోతున్న బిడ్డకు కావాల్సిన అన్ని రకాల అవసరాలను ఈ ఇంట్లో సమాకూర్చాం. అలాగే తన కోసం అందమైన నర్సరీని ఏర్పాటు చేశాం. ఇక తైమూర్ కోసం విశాలంగా దీనిని నిర్మించాం. ప్రస్తుతం కరీనా, సైఫ్ ఉంటున్న ఇంటి కంటే కొత్త ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో విశాలమైన స్విమ్మింగ్ ఫూల్, ఆరుబయట మొత్తం రకారకాల చెట్లతో అందంగా తీర్చిదిద్దాం” అని తెలిపారు.

ఇక కరీనా తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొత్త ఇంట్లోకి మారబోతున్నారని… ఇందుకోసం దాదాపు అనుకున్న సమయంలోనే ఇంటి నిర్మాణం పూర్తిచేయడానికి అందరూ చాలా కష్షపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారి ఇంటి నిర్మాణం పూర్తైందని.. కొత్త ఇంట్లోకి వెళ్లడానికి అంత సిద్దంగా ఉందని తెలిపారు.

Also Read: EPFO: పెన్షన్‌దారులకు ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్..!

Bigg Boss 4: హౌజ్‌లో అఖిల్‌ బర్త్‌డే వేడుకలు.. ముద్దులతో ముంచెత్తిన మోనాల్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu